
నగరంలోని ట్రూప్ బజార్ కు చెందిన విశాల్ తులి అనే యువకుడు చెత్తపై మంత్రి కేటీఆర్ తో పాటు జీహెచ్ఎంసీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ ఫిర్యాదును పోస్ట్ చేశారు. తమ ప్రాంతంలోని నవరంగ్ కాంప్లెక్స్, ఎలక్ట్రిక్ మార్కెట్ వద్ద పేరుకుపోయిన చెత్త ఫొటోలను అందులో పోస్ట్ చేశారు. దీనిని చూసిన కేటీఆర్ వేగంగా స్పందించి, వెంటనే అక్కడి చెత్తను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
కేటీఆర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన పారిశుద్ధ్య కార్మికులు అక్కడి చెత్తను ఒక్క గంటలోనే ఎత్తేశారు. దీనిని గమనించిన విశాల్ తులి… చెత్తను ఎత్తివేసిన తర్వాత అక్కడి ఫొటోలను మరోమారు తీసి వాటిని తిరిగి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి… వేగంగా స్పందించినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…