
అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరని, కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పరిస్థితులు వేరని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఎన్టీఆర్ సినిమా స్టార్ కావడంతో…అప్పట్లో ఆయనకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయన్నారు. కానీ కేసీఆర్‌కు ఎలాంటి అనుకూలతలు లేవని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ కంటే కేసీఆరే గొప్ప అని కేటీఆర్ అంటున్నారా? రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున పార్టీ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా గైర్హాజరయ్యారు. ఇది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే హరీష్ మీడియాతో మాట్లాడి 2001 ఏప్రిల్ 27 చరిత్రలో లిఖించదగిన రోజుని చెబుతూ కేసీఆర్ నాయకత్వంపై పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. మరోవైపు తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలను టీఆర్ఆర్ కైవసం చేసుకుంటుందని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…