
ప్రధాని మోదీ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చోవడానికి బదులు ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్ కూర్చున్నారు. మోదీ, కేటీఆర్ ముచ్చటించుకున్నారు. మోడీ మరొక వైపు గవర్నర్ నరసింహన్ ఆయన పక్కన కేసిఆర్ కూర్చున్నారు. తన వారసుడు, భవిష్యత్తు సీఎం కేటీఆర్ అని కేసిఆర్ చెప్పకనే చెప్పారు.
అంతకు ముందు కూడా ప్రధాని మోడీ కేటీఆర్ కు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. మెట్రో రైలును ఆవిష్కరించే ముందు ఆయన కేటీఆర్ పిలిచి పక్కన నిలబెట్టుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో మరో మంత్రి హరీష్ రావు గాని, కేసిఆర్ కుమార్తె కవితగాని లేకపోవడం విశేషం. భవిష్యత్తు ప్రణాళిక ఏంటో చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.
జీఈఎస్ సదస్సు వద్ద కూడా మంత్రి కేటీఆర్ అన్ని తానే అయ్యి వ్యవహరించనున్నట్టు సమాచారం. మరోవైపు వచ్చే ఎన్నికలకు కేటీఆర్ ను సిఎం అభ్యర్థిగా ప్రకటించి తెరాస ఎన్నికలకు వెళ్లనుందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అదే సమయంలో కేసిఆర్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారట
Is Sivakarthikeyan finally answering the old Sardar vs Prince fan war, four years later? His…
ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు... వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు,…