Telugu

కుమారీ ఆంటీ… రెండు లివర్స్ ఎక్‌స్ట్రా!

జీవితంలో నిలద్రొక్కుకోవడానికే చాలా శ్రమించాల్సి ఉంటుంది. రాణించాలంటే?ఇంకెంత శ్రమించాలో ఖచ్చితమైన లెక్క ఉండదు.

కానీ చిన్న చిన్న ప్రయత్నాలలో విఫలమైనందుకో లేదా సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకనో నిరాశ నిస్పృహలతో క్రుంగిపోయేవారు కొందరైతే, కోట్లాది మంది ఇదే జీవితమనుకుంటూ సర్దుకుపోయి జీవించేస్తుంటారు.

ADVERTISEMENT

కానీ హైదరాబాద్‌లో రోడ్డుపక్కన టిఫిన్ సెంటర్ పెట్టుకున్న ‘కుమారీ ఆంటీ’ అలా సరిపెట్టుకోలేదు.

రోజుకు రూ.50లకు రైతు కూలీగా జీవితం మొదలుపెట్టి, టైలరింగ్ చేశారు. అయితే ఇదీ.. జీవితం కాదనుకున్న ఆమె భర్తతో కలిసి హైదరాబాద్‌ వచ్చి రోడ్డు పక్కన చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు.

ఈ ప్రయత్నం ఫలించింది. కానీ హైదరాబాద్‌లో వేలమంది రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటున్నారు. కనుక తాను కూడా కాస్త డబ్బు సంపాదించుకుంటూ వారిలో ఒకరిగా మిగిలిపోవాలనుకోలేదు కుమారీ ఆంటీ.

వినియోగదారుల అభిరుచులు, వారి బడ్జెట్, వారి సమయం అన్నిటికీ విలువనిస్తూ, రుచికరమైన ఆహరం అందిస్తూ మంచి పేరు ప్రతిష్టలు, వాటితో పాటే డబ్బు కూడా సంపాదించుకున్నారు. ముఖ్యంగా బిల్లు వెయ్యి.. రెండు లివర్స్ ఎక్‌స్ట్రా!అనే ఆమె మాట ఓ పంచ్ డైలాగులా చాలా పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత ఓ యూట్యూబర్‌ వీడియో పుణ్యమాని ఆమె వ్యాపారం రెండింతలు పెరిగింది. కానీ ఆమె బిజినెస్ వలన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతునందున, పోలీసులు అక్కడి నుంచి ఆమె టిఫిన్ సెంటరుని వేరే చోటికి తరలించాలని ఆదేశించారు. నిజానికి ఆమెకు ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బే. కానీ మానవ ప్రయత్నం చేస్తే పైనున్న ఆ దేవుడు కూడా సాయపడతాడన్నట్లు, ఈ విషయం సిఎం రేవంత్‌ రెడ్డి చెవిన పడటం, ఆమెకు అండగా నిలబడటంతో ఆమె ఒడ్డున పడటమే కాదు ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోయింది.

ఆ పాపులారిటీ ఆమెకు కొత్త తలుపులు తెరిచింది. అదీ.. ఎందరో కలలుగనే సినీ పరిశ్రమలో! ‘పాంచాలి పంచ భర్త్రుక’ అనే సినిమాలో చిన్న పాత్ర లభించింది. తనకు మరో ఏడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం లభించిందని కుమారీ ఆంటీ స్వయంగా చెప్పారు.

ఇదివరకు బిగ్ బాస్ షోకి పిలుపు వస్తే వెళ్ళలేకపోయానని, ఈసారి వస్తే తప్పకుండా ఆ షోలో పాల్గొంటానని చెప్పారు.

అంటే మనిషి జీవించడానికి… జీవితంలో రాణించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్న మాట! కానీ అవి పాజిటివ్ థింకింగ్ ఉన్నవారికి ప్రస్పుటంగా కనిపిస్తాయి. లేని వారికి ఏదో ఓ అవకాశం కనిపిస్తే దాంతో సరిపెట్టుకుంటారు. కానీ నెగెటివ్ థింకింగ్ ఉన్నవారు హత్యలు, ఆత్మహత్యలతో ముగిస్తుంటారు.

అందరికీ ఇదే ఫార్ములా వర్తింపజేయడం కూడా సరికాదు. కానీ జీవితంలో రాణించాలనుకునేవారి తీరు ఇలాగే ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi to Kalki 2, Prabhas Has No Breathing Space

Prabhas’ calendar is getting seriously packed. Fauzi is currently keeping him busy, Kalki 2 is…

16 minutes ago

Legendary Cricketers Sons Compared: Virender Sehwag Isn’t Happy

Why are sons of legendary cricketers always compared with their fathers? Virender Sehwag has made…

45 minutes ago