Telugu

రామాయణ మహాభారతాలు: తెలిసింది గోరంత…

“రామాయణ, మహాభారతాలలో లేనిదేది ఈ లోకంలో లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతీది వాటిలో ఉంది…” అని మహర్షులు, జ్ఞానులు, పండితులు చెపుతుంటారు.

అందువల్లే యుగాలు మారినా నేటికీ వాటికి అంత విలువ, ఆదరణ లభిస్తోంది. రామాయణ, మహాభారతాలు ఊట బావి వంటివి. వాటిలో నుంచి తోడుకున్న వారికి తోడుకున్నంత ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది.

ADVERTISEMENT

నిఘంటువు (డిక్షనరీ)లో ఓ పదానికి ఒకటో రెండో అర్ధాలుంటాయి. అవి ఎన్నటికీ మారవు. కానీ ఎప్పుడో యుగాల క్రితం జరిగిన ఈ రెండు పురాణ గాధలు అలాగే ఉన్నప్పటికీ, యుగయుగాలుగా వాటిని శోదిస్తున్న మహర్షులు, పండితులు, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులకు వాటిలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, కొత్త కోణాలు కనిపిస్తూనే ఉన్నాయి… వినిపిస్తూనే ఉన్నాయి.

యండమూరి వీరేంద్రనాథ్ ‘విజయానికి 5 మెట్లు’ పుస్తకంలో ‘ఓ పుస్తకాన్ని చదివిన ప్రతీసారి కొత్త విషయాలు తెలుస్తున్నాయంటే దానర్ధం మన పరిపక్వత స్థాయి పెరుగుతోందని’ చాలా చక్కగా చెప్పారు. అంటే మానవజాతి ఆలోచనా స్థాయి, పరిధి, పరిపక్వతకి మించిన సారాంశం రామాయణ మహాభారతాలలో ఉందన్న మాట!

రామాయణ, మహాభారతాలను నేటి తరంలో చాలా మంది చదివి ఉండకపోవచ్చు. కానీ వివిధ మాధ్యమాల ద్వారా వాటి గురించి ఎంతో కొంత తెలుస్తూనే ఉంటుంది. కానీ వాటిని చిన్నప్పటి నుంచే చదివి, సినిమాలలో చూసిన వారికి వాటి గురించి తమకు పూర్తిగా తెలుసుని గట్టి నమ్మకంతో ఉంటారు.

కానీ ముందే చెప్పుకున్నట్లు ఆ ఊట బావులలో ఎవరికి కావలసినంత వారు పొందారు కానీ ఇంకా చాలా మిగిలే ఉంది… అని నిరూపించింది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న కురుక్షేత్ర యానిమేషన్ వెబ్‌ సిరీస్.

ఈ కురుక్షేత్ర వెబ్‌ సిరీస్‌లో చాలా మందికి తెలియని అనేక పురాణ పాత్రలను పరిచయం చేశారు రచయిత, దర్శకుడు ఉజ్జన్ గంగూలి. కురుక్షేత్ర మహా సంగ్రామానికి అవన్నీ ఏవిదంగా కారణం అయ్యాయి. ఆ మహా యుద్ధంతో అవి ఏ దశలో ఏవిదంగా కనెక్ట్ అయ్యాయి? న్యాయం, ధర్మం కోసం జరిగిన ఆ మహా సంగ్రామంలో చివరికి ఏవిదంగా అన్యాయం, అధర్మంతో ముగిసింది?వంటి అనేక కొత్త విషయాలు, కొత్త కోణంలో చూపించారు.

కురుక్షేత్ర యానిమేషన్ వెబ్‌ సిరీస్… దాని కధ, కధనం, పాత్రలు, సాంకేతిక అంశాలు, పోలికల గురించి చర్చిస్తే అది రివ్యూ అవుతుంది. మన M9తో సహా అనేక వెబ్‌సైట్స్ దీని గురించి భిన్నమైన రివ్యూలు వ్రాశాయి. కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం. కానీ ఓ యానిమేషన్ వెబ్‌ సిరీస్‌లో కూడా ఇన్ని కొత్త విషయాలు తెలియజెప్పడం చాలా గొప్ప విషయమే కదా?

రామాయణ మహాభారతాల్లో ఎవరికీ అంతుపట్టనంత డెప్త్ ఉంది కనుకనే అమీర్ ఖాన్‌, రాజమౌళి వంటివారు కూడా సినిమా తీయాలని తపిస్తున్నారు. మరో వంద రెండు వందలు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రామాయణ, మహాభారతాలలో ఇంకా కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉంటాయి. వాటి గొప్పదనానికి ఇదే నిదర్శనం… కాదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rohit’s 2027 WC Spot: Cricket Legend Warns BCCI

Rohit Sharma and Virat Kohli have retained their places in India’s ODI squad for the…

16 minutes ago

Money And Lands: KTR’s Old Videos Viral Now!

Telangana politics have started to revolve around the discussion on lands and illegal monetary gains…

47 minutes ago