
మెగాస్టార్ మెగా మూవీ “ఖైదీ నంబర్ 150”లో చిరంజీవి సరసన ఓ ప్రత్యేక గీతంలో హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్ ని ఎంపిక చేయడం షాకిచ్చింది. అంతకుముందు ఎంపిక చేసిన కేథరిన్ స్థానంలో లక్ష్మి రాయ్ ని తీసుకున్నట్లుగా ఈ వార్తల సారాంశం. ఇప్పటివరకు లక్ష్మి రాయ్ చాలా ప్రత్యేక గీతాలలో నటించింది. కానీ, మెగా హీరోలలో మాత్రం ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మాత్రమే కనిపించింది.
ఈ ఏడాది సమ్మర్ లో విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో ‘తోబా తోబా…’ పాటలో పవన్ తో పాటు ఆడిపాడింది. అయితే పాట బంపర్ హిట్ అయ్యింది గానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. స్పెషల్ సాంగ్స్ తో రవితేజ వంటి హీరోలకు హిట్లు అందించిన లక్ష్మి రాయ్, మెగా హీరోకు కలిసి రాకపోవడంతో, పాట సూపర్ హిట్ అయినా అవకాశాలు దరిచేరలేదు.
అయితే పవన్ తర్వాత ప్రస్తుతం చిరంజీవి సరసన నర్తించనున్న లక్ష్మి రాయ్, ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో అన్న ఆందోళన మెగా అభిమానుల్లో నెలకొంది. అందులోనూ చిరు రీ ఎంట్రీ సినిమా కావడంతో, ఏ చిన్న తప్పిదానికి కూడా తావు లేకుండా తెరకెక్కుతోంది. బహుశా పవన్ సినిమా ఫెయిల్ అయ్యిందన్న భయం లేకుండానే లక్ష్మి రాయ్ ని, ఈ “ఖైదీ నంబర్ 150” ఎంపిక చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…