
అసలే సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాలు ఏమీ లేవు అని తెగ బాధపడిపోతున్నారు సినిమా అభిమానులు. పెద్ది సినిమా సమ్మర్ రేస్ నుండి తప్పుకోవడంతో మెగా అభిమానులు మరింత హర్ట్ అయ్యారు. అయితే.. మెగా ఫ్యామిలీ నుండి సమ్మర్ లో నేను ఎంటర్టైన్ చేస్తానంటూ వస్తోంది లావణ్య కొణిదెల.
విషయం ఏంటంటే.. లావణ్య త్రిపాఠి ఓ ఏడాది క్రితం నటించిన “సతీ లీలావతి” అనే చిత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. ఎట్టకేలకి మే 8న రిలీజ్ కి రెడీ అయ్యింది. నిజానికి రెండు నెలల క్రితం మార్చి 6న విడుదల చేద్దామని ప్రయత్నించారు. పాపం ఇంట్లో చంటి బిడ్డను వదిలి మరీ ప్రమోషన్స్ కూడా చేసింది లావణ్య. కారణాంతరాల వల్ల సినిమా మళ్లీ వాయిదా పడింది.
ఇప్పుడు సమ్మర్ సీజన్ ఖాళీగా ఉండడం చూసుకుని, దర్శకనిర్మాతలు “సతీ లీలావతి” చిత్రాన్ని మే 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. “శాకుంతలం” ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి “భీమిలి కబడ్డీ జట్టు” ఫేమ్ తాతినేని సత్య దర్శకుడు. సీనియర్ నరేష్, సప్తగిరి, విటివి గణేష్ లు కీలకపాత్రలు పోషించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రమోషనల్ కంటెంట్ & సాంగ్స్ ఓ మోస్తరుగా ఆకట్టుకోగలిగాయి.
లావణ్య త్రిపాఠి మ్యారేజ్ అనంతరం, అది కూడా తల్లైన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడం, మోస్ట్ పాపులర్ కమల్ హాసన్ సినిమా టైటిల్ కావడంతో “సతీ లీలావతి” అనే సినిమాకి బజ్ ఉంది. మరి సినిమాగా ఏమేరకు ఆకట్టుకుంటుంది, హీరోయిన్ గా లావణ్య హిట్టు కొడుతుందా, ఈ సినిమా తర్వాత మళ్లీ నటిగా కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…