
అయితే వాటిని రెట్టింపు చేసే విధంగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ‘విలనిజం’కు సంబంధించిన కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. పోస్టర్స్ లో విడుదల చేసిన లుక్ కు తోడు మరొక లుక్ ఈ లీక్ ఫోటోలలో కనపడుతోంది. చేతిలో గొడ్డలి పట్టుకుని, వికటాట్టహాసం ప్రదర్శిస్తూ తనలోని విలనిజంను చూపించే విధంగా ఉన్న ఈ స్టిల్స్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి. బహుశా జూలై మొదటి వారంలో విడుదల కాబోతున్న టీజర్ లోని స్నాప్ షాట్స్ ను స్టిల్స్ రూపంలో ఇలా లీక్ చేసారా? లేక పోస్ట్ ప్రొడక్షన్ నుండి లీక్ అయ్యాయా? తెలియాల్సి ఉంది. అయితే వచ్చి రావడంతోనే అవి వైరల్ కావడంతో “జైలవకుశ” టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
స్టిల్స్ లో చూస్తుంటేనే జూనియర్ ఎన్టీఆర్ విలనిజం సినిమాకే హైలైట్ గా నిలిచేలా కనపడుతోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కాబోతున్న మహేష్ బాబు “స్పైడర్,” పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల సినిమాల రేంజ్ ను మించిపోయే అంచనాలు ఏర్పడేలా కనపడుతున్నాయి. ఇదే రూపం రాబోయే టీజర్ లో కనపడితే, మార్కెట్ వర్గాల్లో “జైలవకుశ”పై ఎక్కడలేని క్రేజ్ ఏర్పడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సంశయం లేదు. చూడబోతుంటే… జూనియర్ ఎన్టీఆర్ విలనిజం తట్టుకుని పోటీలో నిలవడం ఏ హీరోకైనా అసాధ్యంగానే కనపడుతోంది. కాస్త ఆలస్యమైనా సేఫ్ గా రావడం మేలేమో!
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…