
ఈ సినిమాకు 9 నంది అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ, ప్రతి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. అలాగే ఇన్ని అవార్డులు ఇచ్చిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య. అయితే ఇవన్నీ చెప్పాడని కంటే ముందు… ప్రారంభంలోనే ఓ అదిరిపోయే పంచ్ వేసి, నాటి చిరు – మోహన్ బాబు సంఘటనను గుర్తు చేసారు నందమూరి నటసింహం.
లెజెండ్… ఈ పేరుకు ఎంతటి వివాదామో తెలియనిది కాదు, గతంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే… అంటూ బాలయ్య నవ్వడంతో, మీడియా ప్రతినిధులతో సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఫక్కున నవ్వేసారు. అలా నవ్వులు పూయించిన బాలయ్య, 2014 సంవత్సరంతో పాటు 2015వ ఏడాది అవార్డులు అందుకున్న వారికి కూడా అభినందనలు తెలిపారు బాలయ్య.
అయితే 2016వ సంవత్సరం విన్నర్స్ విషయం మాత్రం ప్రస్తావించలేదు. అది కావాలనే మరిచిపోయారా? లేక కాకతాళీయమో గానీ… అందులో 2016 విన్నర్స్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉండడం, బాలయ్య విస్మరించడంతో ఒక్క ఏడాది అంశం చాలా ప్రాధాన్యతను దక్కించుకుంది. వీరిద్దరి మధ్యన ఉన్న విభేదాలకు మరో తార్కాణం ఇది అంటూ మీడియా వర్గాలలో జరిగే హంగామా రొటినే!
YS Jagan Mohan Reddy left Pulivendula without voting after alleging large-scale irregularities during the municipal…
Vishwak Sen’s Cult has opened to a very poor response at the box office. The…