
మూడు సినిమాలకు ‘యు/ఎ’ సర్టిఫికేట్ లభించగా, ఈ మూడు సినిమాలలో కూడా నితిన్ హీరోగా నటించిన “లై” సినిమా తక్కువ నిడివిని సొంతం చేసుకుంది. 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2 గంటల 24 నిముషాల పాటు సిల్వర్ స్క్రీన్ పైన అలరించడానికి సిద్ధమైంది. ఇటీవల కాలంలో తక్కువ నిడివి గల సినిమాలు, బాక్సాఫీస్ వద్ద ఎక్కువ విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే.
అడ్వాన్సు బుకింగ్స్ లో ముందస్తు వరుసలో ఉన్న రానా “నేనే రాజు నేనే మంత్రి” సినిమా 2 గంటల 49 నిముషాల నిడివి ఉండగా, బోయపాటి “జయ జానకి నాయక” సినిమా 2 గంటల 54 నిముషాల పాటు అలరించేందుకు సన్నద్ధమైంది. సినిమా నిడివి తగ్గట్లే, ఫలితాలు కూడా ఉంటాయా? అనేది వేచిచూడాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో విడుదలైన తర్వాత ‘ఎడిటింగ్’ చేసిన సినిమాల శాతం ఎక్కువే మరి!
The teaser of Jo Jo, titled Caution 1, introduces a group of hopefuls drawn to…
The latest trend in Tollywood is hard to miss. For the past year, whenever a…