
నవంబర్ 4 ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలు టికెట్ కౌంటర్ల వద్ద ప్రేక్షకుల కోసం ఎదురు చూశాయి. అంతో ఇంతో బజ్ ఉన్నవాటిలో ‘ఉర్వశివో రాక్షసివో’ మొదటిది. ఊహించని విధంగా అల్లు శిరీష్ కి పర్లేదనే టాక్ వచ్చింది. టైం పాస్ అయ్యిందనే అభిప్రాయం ఆడియన్స్ లో వ్యక్తమవుతోంది. మరి బన్నీ తమ్ముడు జనాన్ని హాలు దాకా రప్పించగలడా లేదానేది ఆదివారంతో తేలిపోతుంది. అరివీర భీకర ప్రమోషన్లు చేసుకున్న ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ ని ఎవరూ లైక్ చేయడం లేదు. మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ లావాలా ఎగజిమ్ముతోంది. అత్తెసరు కామెడీతో మేర్లపాక గాంధీ చేసిన ప్రయోగం రివర్స్ కొట్టింది.
నందు ఒకప్పుడు హీరో అనే సంగతి పబ్లిక్ ఎప్పుడో మర్చిపోయారు. అయినా సరే ధైర్యంతో ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ టైటిలెట్టుకుని మరీ బరిలో దూకాడు. క్యాస్టింగ్ అట్రాక్షన్ ఎంత మాత్రం లేని ఈ ఎంటర్ టైనింగ్ కం రివెంజ్ డ్రామాని భరించడం కష్టంగానే ఉంది. ‘బనారస్’ అనే మరో కన్నడ డబ్బింగ్ మూవీ టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చింది. హీరో జయేద్ ఖాన్ కొత్త కుర్రాడు. సీన్లను పదే పదే తిప్పి చూపించి అంతగా పండని రెండు మూడు ట్విస్టులతో ఉసూరుమనిపించారు. బడ్జెట్ లో పెట్టిన ఖర్చు స్క్రిప్ట్ లో క్వాలిటీ మీద చెక్ చేసుకోలేదు.
దండుపాళ్యం దర్శకుడి ‘తగ్గేదేలే’ అసలు విషయంలో తగ్గిపోవడంతో ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు.
తారకరత్న ‘సారథి’ ఎప్పుడు తీశారో కానీ అదీ ఇవాళే రిలీజయ్యింది. ఊహించినట్టే దీని ఫలితమూ కనిపిస్తోంది. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ‘జెట్టి’ అనే మరో చిన్న సినిమాను అడిగేవాళ్ళు లేకపోయారు. ఇవి చాలవన్నట్టు బాలీవుడ్ నుంచి రెండు దిగుమతులు వచ్చాయి. జాన్వీ కపూర్ మిలి, కత్రినా కైఫ్ ఫోన్ బూత్ తెలుగు రాష్ట్రాల్లో కనీస స్పందనకు నోచుకోలేదు. ఊర్వశివో ప్రేయసివో మినహాయించి మిగిలిన వాటి కంటే ఇరవై ఏళ్ళ పాత రీ రిలీజ్ ‘నువ్వే నువ్వే’కు కొన్ని చోట్ల కలెక్షన్లు బాగున్నాయి. ఓటిటిల కోసం తొందపడుతున్నారో లేక వదిలించుకుందామని ఇలా సంత మార్కెట్ లో కాయగూరల్లా విడుదల చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి అందరూ మునుగుతున్నారు. ఉన్నవాటిలో శిరీష్ బాబే విన్నర్ గా కనిపిస్తున్నాడు కానీ కన్ఫర్మ్ కావాలంటే ఇంకో రెండు మూడు రోజులు ఆగాలి.
Retired IPS officer AB Venkateswara Rao is set to contest the Vijayawada Municipal Corporation mayoral…
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…