
నారా లోకేష్ యువగళం పాదయాత్రతో తీవ్ర ఆందోళన చెందుతున్న వైసీపీ నేతలు, వారి మీడియా అప్పుడే ఎదురుదాడి ప్రారంభించేశారు. తారకరత్నకి గుండెపోటు వచ్చినందుకు అందరూ ఆందోళన చెందుతుంటే నారా లోకేష్ తొలి అడుగు వేయగానే నందమూరి కుటుంభానికి చెందిన తారకరత్నకి ప్రాణాపాయం కలిగిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
తారకరత్నకి గుండెపోటు వచ్చి కుప్పం హాస్పిటల్లో చావుబ్రతుకుల మద్య ఊగిసలాడుతుంటే నారా లోకేష్ అదేమీ పట్టన్నట్లు పాదయాత్ర చేసుకొన్నారని వైసీపీ మీడియా వ్రాసేసింది. నిన్న కుప్పం బహిరంగసభకి వేలాదిగా కార్యకర్తలు, జనం తరలివస్తే జనాలు లేక సభ వెలవెలపోయిందని, నారా లోకేష్ పాదయాత్రకి ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదని వ్రాసి వైసీపీ నేతలకి మనశాంతి కలిగించింది.
నిజానికి వేలాదిగా కార్యకర్తలు తరలిరావడం వలననే కుప్పంలో మసీదు వద్ద తారకరత్న ఉక్కిరిబిక్కిరి అయ్యి స్పృహతప్పి పడిపోయిన సంగతి అదే మీడియా నిన్న వ్రాసింది. కానీ ఈరోజు జనాలు లేక వెలవెలపోయిందని వ్రాయడం విశేషం.
నారా లోకేష్ పాదయాత్రకి భారీగా జనం, కార్యకర్తలు తరలివచ్చినందున అర్దాంతరంగా రద్దు చేసుకొని వెళితే వారందరూ బాధపడతారని, అదీగాక పాదయాత్ర తొలిరోజే అర్దాంతరంగా రద్దు చేసుకొంటే అశుభమని భావించి నారా లోకేష్ తొలి రోజు పాదయాత్రని పూర్తి చేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. రాత్రి చాలాసేపు వరకు బాలయ్యతో పాటు అక్కడే ఉన్నారు. తారకరత్నని బెంగళూరు తరలించాలని నిర్ణయించిన తర్వాత రాత్రి సుమారు 10 గంటలకి నారా లోకేష్ అక్కడి నుంచి వెళ్ళారు.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి నిన్న రాత్రి 9.30 గంటలకి కుప్పం చేరుకొన్న తర్వాత ఆమెకి పరిస్థితి వివరించి ఆమె అనుమతితో అర్దరాత్రి 11.30-12.00 గంటలకి రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కనుక తారకరత్నని బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్కి అంబులెన్సులో తరలిస్తే అదీ నాటకీయమేనట!
SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…
The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…