
రైటర్ పద్మభూషణ్ మంచి విజయం సాధించింది. చాలా తక్కువ బిజినెస్ జరుపుకుని భారీ లాభాలతో సేఫ్ అయ్యింది. దానికి ఛాయ్ బిస్కెట్ బృందం చేసిన మార్కెటింగ్ చాలా దోహదపడిందన్న విషయం మర్చిపోకూడదు. రంగమార్తాండకు పొలోమని పబ్లిక్ పరుగులు పెట్టడం లేదు కానీ బాగుందనే మాట విని అంతో ఇంతో ఫ్యామిలీస్ మల్టీప్లెక్సుల్లో కనిపిస్తున్నాయి. కృష్ణవంశీ నాలుగైదు నెలల నుంచి సోషల్ మీడియానే ప్రపంచంగా, పబ్లిసిటీ అస్త్రంగా వాడిన దానికి ఈ మాత్రం ఫలితం వచ్చింది. ఫ్రీగా వేసిన షోల సంగతి సరేసరి.
వీటిని గమనిస్తే చిన్న సినిమాలకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయా అంటే అప్పుడే తొందరపడి అవుననే కంక్లూజన్ కు రాలేం. ఎందుకంటే వీటికి ఆక్సిజన్ అందాలంటే కేవలం ప్రమోషన్లు చేస్తే సరిపోదు. టికెట్ రేట్ల వెసులుబాటు, జనాలకు మూవీ గురించి తెలిసేలా క్రియేటివ్ పబ్లిసిటీ ఇంకా చాలా అవసరం. ఒకప్పుడు సూరిగాడు, అమ్మరాజీనామా, మాతృదేవోభావ లాంటి కన్నీళ్ల చిత్రాలు నిర్మాతలకు కనక వర్షం కురిపించాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా కూడా బడ్జెట్ ని పట్టించుకోకుండా కథలో క్వాలిటీని ఉంటే పట్టం కట్టేస్తున్నారు.
ఇకపై ప్రొడ్యూసర్లు ఇంకా సీరియస్ గా చిన్న బడ్జెట్ సినిమాలను ఎలా చేరువ చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. బలగం వెనుక దిల్ రాజు ఉన్నారు కాబట్టి అంత రీచ్ వచ్చింది. రైటర్ పద్మభూషణ్ కు ఇండస్ట్రీ ప్రముఖులు సపోర్ట్ చేశారు కాబట్టి బాగా చూశారు. రంగమార్తాండకు దాదాపు పరిశ్రమ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రీమియర్లు వేశారు. కానీ అందరికీ ఇలా సాధ్యం కాదుగా. నెలలు తరబడి సంవత్సరాల తరబడి ల్యాబులో మగ్గిపోతున్న వాటిని ధైర్యంగా బయటికి తీసుకొచ్చే పరిస్థితులు కావాలి. అప్పుడే మంచి రోజులొచ్చినట్టు.
MS Dhoni's role at Chennai Super Kings (CSK) has become a talking point ahead of…
After a long wait, Rajkummar Rao’s Prahaar has arrived on the big screen. The actor…