
ప్రజల నుంచి వచ్చిన కలెక్షన్లు తీసుకుని ఆదరణను లెక్కించాలని ఎన్వీ ప్రసాద్ వ్యాఖ్యానించగా, జ్యూరీ అన్ని సినిమాలనూ చూసి నిర్ణయం తీసుకుంటుందని త్రిపురనేని కామెంట్ చేశారు. రుద్రమదేవి సినిమాకు సంబంధించి దరఖాస్తు చేసిన కేటగిరీలో కాకుండా, వేరే కేటగిరీలో అల్లు అర్జున్ కు అవార్డు ఇవ్వడాన్ని ఎన్వీ తప్పుబట్టారు. దీనిక్కూడా కౌటరేసిన త్రిపురనేని, అల్లు అర్జున్ ఆ చిత్రంలో ఓ క్యారెక్టర్ మాత్రమే చేశాడని, హీరో కాదని గుర్తు చేస్తూ, అతని కృషికి గుర్తింపుగా మరో కేటగిరీలో అవార్డును ఇవ్వడం తప్పేంటని ప్రశ్నించారు.
వీరిద్దరి చర్చ మధ్యా కల్పించుకున్న దర్శకుడు వీరశంకర్, అభిమానులు తమ హీరో అల్లు అర్జున్ ను ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తించారని భావించడం కూడా సమస్యను జఠిలం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రకాశ్ రాజ్ వంటి వాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్టులని తెలుగు సినీ అభిమానుల్లో ఓ ముద్ర పడిపోయిందని చెప్పిన ఆయన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న పదాన్ని వాడటమే జ్యూరీ తప్పయిందని అన్నారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…