
విచిత్రం ఏంటంటే సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ,లూసిఫర్ అదే పేరుతో ,తెలుగులో అనువదించి, రిలీజ్ అయ్యింది. మలయాళ మసాలా మన తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చక ప్లాప్ అయ్యింది.కానీ లూసిఫర్ లో హీరోఇజం బాగా నచ్చిన చిరంజీవి చాల ధైర్యం చేసి రీమేక్ చేసారు సల్మాన్ భాయ్ ని, అతిధి పాత్రలో నటింపచేసారు.
సైరా సినిమా మెగాస్టార్ కెరీర్ లో, పాన్ ఇండియా ప్లాప్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం, ఆచార్య ప్లాప్ వలన, మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ చాలా తగ్గింది. ఈ పరిస్థితులలో ఈ గాడ్ ఫాదర్ ని, మలయాళం లో డబ్బింగ్ చేసి, రిలీజ్ చెయ్యడం సినీ పరిశ్రమని, ప్రేక్షకులని ఆశ్చర్యపోయేలా చేసింది.
లేటుగా పబ్లిసిటీ మొదలుపెట్టిన, మెగా నిర్మాతలు లేటెస్టుగా వదిలిన పోస్టర్స్ లో గాడ్ ఫాదర్ మలయాళ పోస్టర్ చూసి మళయాళీ చేటలు (అన్నలు) ట్విట్టర్ లో విమర్శిస్తున్నారు. ఈ గాడ్ ఫాదర్ సినిమా లో అల్లు అర్జున్ చిన్న పాత్ర పోషిస్తే ఈ సినిమాకి మలయాళం లో కనీస ఓపెనింగ్ కలెక్షన్స్ ఆశించొచ్చు. కేవలం హీరోయిన్ నయనతార మాత్రమే ఈ సినిమాలో నటించిన మలయాళీ. సల్మాన్ ఖాన్ ని చూడటానికి మళయాళీ జనాలు ఖచ్చితంగా థియేటర్ కి రారు.
ఎంతో ధైర్యంగా ఈ గాడ్ ఫాదర్ ని మలయాళం రిలీజ్ చేస్తున్న, మెగా నిర్మాతలని అభినందించాల్సిందే. ఈ దసరాకి గాడ్ ఫాదర్ ఎలాంటి రికార్డ్స్ సృష్టించబోతున్నారో… మరికొద్ది రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది!
Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…
In the Bigg Boss TV reality show, every season, someone gets a lot of push.…