
ఫ్రెష్ టాలెంట్ కోసం ఇండస్ట్రీ పరుగులు పెడుతున్న టైంలో పదిహేనేళ్ల కెరీర్ పూర్తయినా ఇంకా అవకాశాలు వస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నాకు సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి స్పీడ్ తో సాగుతోంది. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 అనే ఒక వెబ్ సిరీస్ చేసింది. మొదటి భాగం మంచి హిట్టు. దాంతో ఆ బ్రాండ్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో మరింత రొమాన్సు, సెక్సు దట్టించి నలుగురు దర్శకులు చెక్కారు.
అందులో మిల్కీ బ్యూటీ నటించిన ఎపిసోడ్ సెక్స్ విత్ ఎక్స్. నిజ జీవిత బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ అయితే కెమిస్ట్రీ బ్రహ్మాండంగా పండుతుందని భావించిన దర్శకుడు సుజయ్ ఘోష్ ఇద్దరి మధ్య రొమాన్స్ ని వంట గది సాక్షిగా చాలా ఘాటుగా చిత్రీకరించారు. కానీ అదంతా చెడిపోయిన ఫ్రిజ్జులో ఐస్ క్రీం దాచినట్టు అయ్యింది. జీవం లేని సన్నివేశాలతో ఎంత గ్లామర్ ఒలకబోసినా అది ఆడియన్స్ కి కనెక్ట్ కాదు.
తమన్నా ఎక్స్ ప్రెషన్లతో జీవించింది. కెమెరా ముందున్న సంగతి మర్చిపోయి విజయ్ వర్మతో లిమిట్స్ దాటేసింది. పెర్ఫార్మన్స్ కి ఛాన్స్ లేని కథలో ఎంత శృంగారం ఒలకబోసినా ఏం ప్రయోజనం. అదే జరిగింది. తనను ట్రోలింగ్ చేయడం వాళ్ళ గురించి ట్విట్టర్ అంకుల్స్ అంటూ నెటిజెన్ల మీద సెటైర్లు వేస్తున్న తమన్నా అసలు మన కల్చర్ లో నెట్ ఫ్లిక్స్ బలవంతంగా జొప్పిస్తున్న ఈ ఓవర్ సెక్స్ కథల ప్రభావం టీనేజ్ మైండ్స్ మీద ఉండదని గుర్తించడం లేదేమో.
ఫ్యామిలీ సంగతి దేవుడెరుగు కనీసం భార్యాభర్తలు కూర్చుని చూడాలన్నా ఇబ్బంది పడేంత గొప్పగా లస్ట్ స్టోరీస్ 2, అందులోనూ ఈ సెక్స్ విత్ ఎక్స్ ని తీసిన తీరు గురించి విశ్లేషిస్తూ పోతే విమర్శలకు పేజీలు కాదు, పుస్తకాలు సరిపోవు. సమాజంలో జరుగుతున్నదే చూపిస్తున్నామని తమన్నా లాంటి వాళ్ళు లాజిక్ తీయొచ్చు.
కానీ బెడ్ రూమ్ విషయాలని కనీసం తల్లితండ్రులతో కూడా పంచుకోని ఒక సంస్కృతికి అలవాటు పడిన జనాలకు ఇలాంటి లస్ట్ లని విపరీత ధోరణిలో చూపించే ప్రయత్నం చేయడం వ్యక్తిగత ఇమేజ్ కి కూడా భంగమని ఇలాంటి పేరున్న ఆర్టిస్టులు గుర్తించిన రోజు ఇవి ఖచ్చితంగా ఆగుతాయి. లేదూ ఇదంతా మాకెందుకు రెమ్యునరేషన్లే చాలనుకుంటే ఎవరైనా ఏం చేయగలరు.
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…
Yami Gautam’s Nayyi Navelli is finally out now in theatres. Horror comedy films are working…