Telugu

భామలు భామలు… ఊపేస్తున్న థమన్..!

ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల ఆల్బమ్స్ లో ఒకటి, రెండు పాటలు వినసొంపుగా ఉండడమే గగనంగా మారిపోయిన సంగతి సంగీత ప్రియులకు తెలిసిందే. అంతకుముందు కనీసం పెద్ద సినిమాలలో అయినా, కాస్త శ్రోతల అభిరుచికి తగ్గట్లుగా పాటలు ఉండేవి. కానీ ప్రస్తుతం పెద్ద సినిమాల ఆడియోలు కూడా డిజాస్టర్లుగా మారుతున్న తరుణంలో… “మహానుభావుడు” సినిమాకు థమన్ అద్భుతమైన స్వరాలను సమకూర్చారు.

ఇందులో మొత్తం ఆరు పాటలు ఉండగా, మొత్తం ఆరు పాటలు కూడా బాగుండడం చెప్పుకోదగ్గ విషయం. అందులో కూడా ‘భామలు భామలు…’ అంటూ సాగిన పాట మాస్ కు విపరీతంగా ఎక్కేసింది. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఈ పాటకు ప్లస్ పాయింట్ గా మారగా, దానికి తగిన విధంగా మాంచి హుషారైన బీట్ ను అందించాడు థమన్. ఈ పాటకు నకాష్ అజీజ్ హుషారైన స్వరం తోడవ్వడంతో చార్ట్ బస్టర్స్ లో నిలబెట్టింది.

ADVERTISEMENT

మిగిలిన పాటలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండగా, ఆడవారిని టీజ్ చేస్తూ సాగిన ఈ పాట మాత్రం అన్ని వర్గాలకు బాగా చేరువ అయ్యింది. ఇటీవల కాలంలో ఓ సినిమాలో అన్ని పాటలు బాగుండడం బహుశా “మహానుభావుడు” సినిమాతోనే తీరిందని చెప్పాలి. మరి ఈ బ్లాక్ బస్టర్ సాంగ్స్ “మహానుభావుడు” సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు దోహదం చేస్తాయో, ఈ నెల 29వ తేదీన తేలనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

యష్‌తో ఆదిత్య ధర్ కలిస్తే… వర్మ పరిస్థితేంటి?

ధురంధర్‌కు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ట్వీట్లతో ఆ సినిమాను, దర్శకుడు ఆదిత్య…

3 minutes ago

Pics: Anaira Stuns In Sizzling Boho Chic Fashion

Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…

19 minutes ago