
ముఖ్యంగా… ఫ్రెష్ నెస్ తో కూడిన కధను ఎంపిక చేసుకోవడం, కధలో నుండి కామెడీ పుట్టించడం అనేది ‘మహానుభావుడు’ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్ గా మారాయి. ఇక సినిమా అంతటిని తన భుజస్కందాలపై వేసుకుని అద్భుతమైన అభినయాన్ని పండించడంలో నూటికి నూరు శాతం శర్వా సక్సెస్ సాధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే… “మహానుభావుడు” అంతా శర్వామయం అనాలి. అంతలా ఆన్ స్క్రీన్ లో తన యాక్టింగ్ ప్రతిభను కనపరిచాడు శర్వానంద్.
ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే, యువీ క్రియేషన్స్ సంస్థ ఏ పెద్ద సినిమాకు తగ్గని రేంజ్ లో తెరకెక్కించారు. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే బంపర్ హిట్ కాగా, ఆన్ స్క్రీన్ లో విజువల్ గా కూడా అవి అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ దసరాకు ప్రేక్షకుల సరదా తీర్చే సినిమాగా “మహానుభావుడు”ను డిక్లేర్ చేయడం బహుశా మరికొద్ది గంటల్లోనే ఉంటుంది. రెండు పెద్ద సినిమాలలో లోపించిన వినోదాన్ని “మహానుభావుడు” ద్వారా మారుతీ – శర్వాలు ప్రేక్షకులకు అందించారనేది ‘ప్రీమియర్ ఫస్ట్ టాక్.’
BOTTOM LINE Clueless Film, Forgettable Debut! RATING 1.25/5 Story, Screenplay, Director: Manchala Nagaraj Cast: Maadhav,…
BOTTOM LINE Second Half Drowns RATING 2/5 Story, Screenplay, Director: Mathimaran Pugazhendhi Cast: Soori, Suhas,…