
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోకు ‘ఓసిడి’ అనే దిజార్డర్ ను పెట్టాడు మారుతీ. ‘అతి క్లీన్’గా ఉండే వ్యక్తిగా శర్వానంద్ చేసిన సిత్రవిసిత్రాలను టీజర్ రూపంలో వినాయకచవితి కానుకగా విడుదల చేసారు. హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే సమయంలో కూడా… ‘బ్రష్ చేసావా’ అని అడిగాడంటే హీరో క్యారెక్టర్ ఎంత అతి శుభ్రత వహిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అలా ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు హీరో క్యారెక్టర్ ను ప్రేక్షకులకు సరిగ్గా పరిచయం చేసారు మారుతీ.
వరుస సక్సెస్ లతో ఉన్న శర్వా లుక్ పాత్రకు తగ్గట్లుగా ఉండగా, ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమా తర్వాత హీరోయిన్ మేహ్రీన్ కుర్ మరోసారి తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ‘మహానుభావుడివేరా…’ అన్నది హమ్మింగ్ గా ఉంటూ ఆకట్టుకుంది. యువీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి షాట్ లోనూ కనపడుతోంది. దీంతో ‘భలే భలే మగాడివోయ్’ తరహాలోనే మరో ‘సూపర్ ఫన్’ సినిమాను సిద్ధం చేసాడన్న సంకేతాలు అయితే ఈ “మహానుభావుడు” టీజర్ ఇచ్చింది.
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…
Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…