Telugu

రౌండ్ 2 – తారక్, మహేష్ లకు శర్వా డేంజర్ సిగ్నల్స్!

ఈ దసరాకు బరిలో ఉన్న మూడు సినిమాలో రెండు పెద్ద సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతాయో లేదో చెప్పడం కష్టం గానీ, మూడో సినిమా “మహానుభావుడు” మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కొడుతుందన్న నమ్మకాన్ని ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ కలిగించింది. ‘జై లవకుశ, స్పైడర్, మహానుభావుడు’ సినిమాల ట్రైలర్స్ ను పరిశీలిస్తే… ఈ మూడింటిలో శర్వానంద్ సినిమాదే పూర్తి ఆధిపత్యం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే థమన్ అందించిన ఆడియో ద్వారా తిరుగులేని హవాను కొనసాగించిన శర్వా, ట్రైలర్ విషయంలోనూ అదే దూకుడును కొనసాగించాడు.

ఈ సినిమా టీజర్ కు కొనసాగింపుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ‘ఫుల్ ఎంటర్టైన్మెంట్’ గ్యారెంటీ అన్న నమ్మకాన్ని పెంచింది. అంతేకాదు, ‘జై లవకుశ, స్పైడర్’ సినిమాలలో మిస్ అయ్యే ప్రధాన ‘ఎలిమెంట్’ కామెడీ, ఈ “మహానుభావుడు” సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో రెండు పెద్ద సినిమాలకు శర్వానంద్ నుండి డేంజర్ సిగ్నల్ వెళ్తున్నాయి. మారుతీ బ్యాక్ గ్రౌండ్ లో “భలే భలే మగాడివోయ్” వంటి బ్లాక్ బస్టర్ విజయం ఉండడంతో, దర్శకుడి పరంగా కూడా “మహానుభావుడు” ట్రేడ్ వర్గాలలో క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంది.

ADVERTISEMENT

ఒకవేళ రెండు పెద్ద సినిమాలకు మంచి టాక్ వచ్చి… సూపర్ హిట్ బాట పట్టినా, ఎన్నో కొన్ని ధియేటర్లలో ‘మహానుభావుడు’ తిష్ట వేయడం ఖాయంగా కనపడుతోంది. ఈ సినిమాను ప్రభాస్ సన్నిహితులైన యువీ సంస్థ నిర్మిస్తుండడంతో ధియేటర్ల పరంగా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురుకాకపోవచ్చు. చూడబోతుంటే… ఈ సంక్రాంతి విడుదలైన రెండు పెద్ద సినిమాలలో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా “శతమానం భవతి” నిలువగా, అదే బాటలో శర్వానంద్ మళ్ళీ ఈ దసరాకు “మహానుభావుడు”ను నిలపనున్నాడన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas, Yash Ran Away from Clash & Still Got Destroyed?

There is a strange coincidence surrounding Raja Saab and Toxic. Both Prabhas and Yash were…

8 minutes ago

యష్‌తో ఆదిత్య ధర్ కలిస్తే… వర్మ పరిస్థితేంటి?

ధురంధర్‌కు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ట్వీట్లతో ఆ సినిమాను, దర్శకుడు ఆదిత్య…

11 minutes ago