Telugu

అగ్ర హీరోలకు ఇదొక ‘గుణపాఠం’

2017 దసరా పండగకు వచ్చిన మూడు సినిమాలలో “విన్నర్” ఎవరో తెలిసిపోయింది. ఎ టు జడ్… ఇలా అన్ని విభాగాలలోనూ… “మహానుభావుడు” సినిమానే ఈ ఏడు దసరా ‘విజేత’ అని క్లియర్ పిక్చర్ వచ్చేసింది. లేటుగా వచ్చినా లేటెస్ట్ కధతో రావడంతో ప్రేక్షకుల తీర్పు కూడా లేటెస్ట్ గా అందించారు. సందర్భోచితమైన హాస్యంతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ‘దసరా విన్నర్’గా నిలుస్తుందని, బహుశా ఈ సినిమాను నిర్మించిన యువీ క్రియేషన్స్ కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు.

ADVERTISEMENT

ఎందుకంటే రెండు పెద్ద సినిమాలను దాటుకుని విడుదలైన “మహానుభావుడు” సినిమాని గెలిపించిన ఘనత ‘జై లవకుశ’ మరియు ‘స్పైడర్’ చిత్రాలకే చెందుతుంది. ఇద్దరు టాప్ హీరోలు సాధించలేని విజయాన్ని, శర్వానంద్ ఎలా అందుకున్నారు? అంటే… ప్రేక్షకులు ప్రస్తుతం కొత్తదనానికే ఓటు వేస్తున్నారని ‘మహానుభావుడు’ సినిమా ద్వారా మరోసారి నిరూపితం అయ్యింది. ‘ఓసిడి’తో కూడిన ఫ్రెష్ కధను ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చి, కావల్సినంత వినోదాన్ని పండించడంతో విజయం వరించింది.

అగ్ర హీరోలకు ఇదొక గుణపాఠం లాంటిదని చెప్పాలి. రొటీన్ మూస కధలను ఎంపిక చేసుకుని, ఓపెనింగ్స్ తో కోట్లకు కోట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో క్రేజీ కాంభినేషన్లను సెట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారే తప్ప, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కధలను ఎంపిక చేసుకోవడం లేదని అర్ధమవుతోంది. గత రెండేళ్లుగా అగ్ర హీరోలు నటించిన సినిమాల కంటే, ఇలా నాని, శర్వానంద్ వంటి ‘స్వయంకృషి’తో పైకి వచ్చిన హీరోల సినిమాలే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా జయకేతనం ఎగురవేస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

9 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

9 hours ago