Telugu

ఆ నలుగురు” ఎలా బతికి బయటకు వచ్చారు?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పెను ప్రమాదం నుండి బయట పడ్డారు. చివరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదేమీ సాధారణ ప్రమాదం కాదు. నిజంగా ఈ సంఘటన చూసిన తర్వాత, సిఎంతో సహా మిగతా ముగ్గురు చిరంజీవులై తిరిగి వచ్చారంటే… నిజంగా భూమి మీద నూకలు ఉన్నాయన్న నానుడిని రుజువు చేసిన వారే.

ADVERTISEMENT

ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కాగా, ఆపై తీసిన దృశ్యాల వీడియో మీడియా ఛానల్స్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాల్లో హెలికాప్టర్ రెక్కలన్నీ విరిగిపోయి, రెండు తలుపులు పూర్తిగా ధ్వంసం అయినట్లు కనిపిస్తున్నాయి. క్రాష్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి కేవలం ఐదారు మీటర్ల దూరంలోనే నివాస గృహాలు, ఓ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ వైర్లు ఉన్నాయి. చాపర్ రెక్కలు పక్కనున్న రేకుల షెడ్ గోడకు తగిలి విరిగిపోయాయి. వీటి ధాటికి పక్కనే ఉన్న ఓ లారీ అద్దాలు పగిలిపోయాయి.

చాపర్ తోకకు ఉండే ఫ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. బేస్ దెబ్బతింది. హెలికాప్టర్ అద్దాలు పగిలిపోయాయి. అయితే, హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చివరి క్షణంలోనే ఇదంతా జరగడం, ఆపై అది కేవలం ఒకటి, రెండు మీటర్ల ఎత్తు నుంచే కింద నిట్టనిలువుగా పడటంతోనే అందులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఏది ఏమైనా పెను ప్రమాదం నుంచి ఫడ్నవీస్ క్షేమంగా బయటపడటం చెప్పుకోదగ్గ విషయమే. నిజానికి ఈ వీడియో చూసిన తర్వాత ఆ నలుగురు ఎలా బ్రతికారు? అన్న ప్రశ్న తలెత్తడం సహజం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

EVM అయినా.. బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పెమ్మసాని

ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ప్రజల తీర్పు మాత్రం కూటమికే అనుకూలంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని…

2 minutes ago

వంగవీటి రాధ బర్త్ డే గిఫ్ట్ లోడింగ్..?

ఏపీ వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల సమరంలో రాజకీయాలకు అత్యంత కేంద్ర బిందువుగా ఉండే విజయవాడ మేయర్ పీఠంపై తీవ్ర…

7 minutes ago