Telugu

‘1 నేనొక్కడినే’ సినిమా ప్రియులకు శుభవార్త!

2014 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన “1 నేనొక్కడినే” సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రతికూల ఫలితాన్ని చవిచూసింది. అయితే క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా 14రీల్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు చాలా మంది అభిమానులే ఉన్నారు. కొత్తదనం, వినూత్నం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ‘ఫీస్ట్’ వంటిది కావడంతో… బాక్సాఫీస్ బరిలో నిలవలేకపోయినా… ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది.

అయితే ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ వీక్షించే సౌకర్యం లేకుండా నిర్మాతలు ప్రిన్స్ అభిమానుల సహనాన్ని పరీక్షించారు. ఈ సినిమా డివిడి, బ్లూరేలు కావాలని ప్రిన్స్ అభిమానులు నిర్మాతలైన 14రీల్స్ ను సోషల్ మీడియా వేదికగా అడిగిన సందర్భాలు కోకొల్లలు. దాదాపుగా గత రెండేళ్ళ నుండి సాగుతున్న ఈ ప్రక్రియకు అతి త్వరలోనే తెరపడబోతోంది. తాజాగా ఈ సినిమా బ్లూరే, డివిడిలను విడుదల చేయనున్నట్లు ‘భవాని డివిడి’ యాజమాన్యం ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ADVERTISEMENT

రాక్ స్టార్ గా ప్రిన్స్ అభినయం, అతని కెరీర్ లోనే ‘ది బెస్ట్’గా అభివర్ణించవచ్చు. ఒక్క షాట్ లో కూడా అలాంటి టిపికల్ క్యారెక్టర్ నుండి బయటకు వెళ్ళకుండా దాదాపు 3 గంటల సేపు ప్రిన్స్ ప్రదర్శించిన అభినయానికి అవార్డుల పరంగా తగినంత గుర్తింపు లేకున్నా, ప్రేక్షకుల హృదయాలలో మాత్రం చెరగని ముద్ర వేసారు. ఇక, సుకుమార్ ప్రతిభకు తార్కాణంగా నిలిచే ఈ సినిమాలో దర్శకుడు ఇచ్చిన ‘ట్విస్ట్’లకు విజ్ఞులంతా ‘హ్యాట్సాఫ్’ అన్నారు. రత్నవేలు అద్భుతమైన ఫోటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ హంటింగ్ మ్యూజిక్… ఇలా అన్ని అంశాలలో అత్యున్నతమైన ప్రతిభను ప్రదర్శించిన ఈ సినిమా ప్రియులకు బ్లూరే, డివిడిల సమాచారం మిక్కిలి సంతోషదాయకం.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Why Prabhas and Akshay Ran Away from Shraddha Kapoor?

Akshay Kumar and Shraddha Kapoor were supposed to clash at the box office in December…

12 minutes ago

Nani’s Big Paradise Request: Will Revanth Reddy Allow?

After the tragic stampede during the Pushpa 2 premiere at Sandhya Theatre in Hyderabad, Tollywood…

32 minutes ago