Telugu

శ్రీమంతుడు…. తిరిగి ఇచ్చేస్తున్నాడు..!

హైదరాబాద్ లో నివశిస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు యుఎస్ఏలో నివశిస్తున్న ఓ చిన్నారి అభిమాని ఉత్తరం రాసింది. ఏంటి… పక్కన ఉన్న వ్యక్తికే వాట్సప్ సందేశం ఇచ్చే నేటి రోజుల్లో… యుఎస్ లో ఉండి ఉత్తరం రాయడం ఏంటి… అనుకుంటున్నారా? అవును… ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. సామాన్యంగా అలా జరగదు కాబట్టే… మహేష్ బాబు కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సదరు ఉత్తరాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ADVERTISEMENT

నేహా అనే ఓ ఆరేళ్ళ చిన్నారికి తన స్కూల్ లో ఇచ్చిన వర్క్ రీత్యా… తనకు ఇష్టం వచ్చిన సెలబ్రిటీకి లేఖ రాయాలని కోరగా, నేహా మహేష్ బాబుకు ఈ లేఖ రాసింది. ‘శ్రీమంతుడు’ తన ఫేవరేట్ సినిమా అని, ప్రతి సినిమా చూశానని, గౌతమ్, సితారలు చాలా క్యూట్ గా ఉన్నారని, మీ నుండి తిరుగు లేఖ అందితే చాలా గౌరవంగా ఫీల్ అవుతానని రాసిన లేఖను మహేష్ బాబు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… నేను కూడా ప్రత్యూత్తరమే రాస్తానని స్పష్టం చేసారు.

బహుశా నేహాకు ఇష్టమైన ‘శ్రీమంతుడు’ సినిమాలోని థీమ్ నే మహేష్ బాబు కూడా ఫాలో అవుతున్నట్లున్నారు. అందుకే నేహ తనకు ఇచ్చిన మధురానుభూతులను తిరిగి నేహాకే ఇచ్చేయాలని, ప్రత్యూత్తరం రాస్తున్నారు. మహేష్ నుండి లేఖ అందుకోనున్న నేహా, తన స్కూల్ కే హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. నేహా భవిష్యత్తు బాగుండాలని… దేవుని ఆశీస్సులు కోరుతూ… మహేష్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Unexpected BO Success Gives Big Hope to 4000 Cr Ramayana?

Mythological subjects have managed to leave an impression on the audience over the last few…

13 minutes ago

NBK111: Balayya’s Return Has Become Crucial

Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…

44 minutes ago