సూపర్‌ ఫ్యాన్స్‌ కల నెరవేరబోతుంది

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ చాలా కాలంగా కలలు కంటున్న కాంబినేషన్‌లో మూవీ వచ్చే సంవత్సరం పట్టాలెక్కబోతున్న విషయం తెల్సిందే. మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమాకు దాదాపు అంతా సిద్దం అయ్యింది. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేస్తున్న మహేష్‌బాబు ఆ వెంటనే మురుగదాస్‌ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ సంతోష్‌ శివన్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. మహేష్‌, మురుగదాస్‌ల కాంబోకు సంతోష్‌ శివన్‌ చేరడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేలా ఒక వార్త ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. అదే ఈ మూవీకి ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందించనున్నాడట.

రహమాన్‌ సంగీతం అందించడంతో మహేష్‌బాబు, మురుగదాస్‌ల సినిమా మరో స్థాయికి వెళ్లడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. మహేష్‌బాబు, మురుగదాస్‌, ఏఆర్‌ రహమాన్‌, సంతోష్‌ శివన్‌ వంటి హేమా హేమీలు జత కడితే అది పెద్ద సంచలనం అవ్వడం ఖాయం. ఈ సంచలన తెరరూపం దాల్చాలని మహేష్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. గతంలో మహేష్‌బాబు నటించిన ‘నాని’ సినిమాకు ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే. మళ్లీ ఇప్పుడు మహేష్‌, రహమాన్‌లు జత కట్టబోతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వచ్చే ఏప్రిల్‌లో ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే అవకాశాలున్నాట్లుగా తెలుస్తోంది. ఠాగూర్‌ మధు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. తెలుగు, తమిళం మరియు హిందీల్లో ఒకే సారి ఈ సినిమాను తెరకెక్కించి ఒకే సమయంలో విడుదల చేయాలని మురుగదాస్‌ పక్కా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మహేష్‌ బాబు ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సంవత్సరం చివర్లో లేదా 2017 ఆరంభంలో సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

Share
Published by

Recent Posts

Pakistan’s India Win Backfired? Ex-Captain’s Bombshell

Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…

31 minutes ago

KTR Uses Jagan’s Famous Dialogue Again?

Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…

1 hour ago