
ఆ క్రమంలోనే తాజాగా మరొక వార్త నెట్టింట లీక్ అయ్యి సందడి చేస్తోంది. అయితే ఈ వార్త ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. ఎంతలా అంటే… ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా? అనేటంతగా..! అవును… లేటెస్ట్ టాక్ ప్రకారం… ఈ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు 20 నిముషాల పాటు సాగే సన్నివేశం సినిమాకే హైలైట్ కాబోతుందని తెలుస్తోంది. చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు అవాక్కయ్యే విధంగా ఈ సీన్ ఉంటుందని ప్రిన్స్ అభిమానులను మరింతగా ఊరిస్తున్నారు.
మురుగదాస్ తన టేకింగ్ తో ఈ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లబోతున్నాడని, ఆ స్థాయి నమ్మకంతోనే ఇటీవల ‘బ్లాక్ బస్టర్ ఆన్ ది వే’ అంటూ సందేశం ఇచ్చారని, ఈ సినిమా షూటింగ్ ముగిసేపోయే సమయానికి దాదాపుగా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి నాటికి షూటింగ్ మొత్తం ముగిసిపోయే విధంగా షెడ్యూల్స్ ఉన్నాయని, సమ్మర్ సెన్సేషన్ గా ఈ సినిమా ముస్తాబవుతోందని టాలీవుడ్ వర్గాల నుండి వెలువడుతోన్న కబురు.
Following the terrible failures of Indian 2 and Thug Life, Kamal Haasan has still not…
Manjari Fadnnis is setting screens ablaze with a spellbinding beachside photoshoot drenched in pure golden…