
ఏ హీరో కెరీర్ లో అయినా ఒకటి, రెండు ప్లాపులు సహజం, దీనికే అంతగా చర్చించాలా? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వెలువడుతుంది. ప్లాపులు, హిట్లు సహజమే, ఇందుకు ఏ హీరో కూడా అతీతం కాదు. కానీ మహేష్ కు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ రెండూ కూడా దారుణ పరాజయాలు. ఒక స్టార్ హీరోకు దక్కాల్సిన కనీస ఓపెనింగ్స్ ఈ రెండు సినిమాలకు రాకపోవడం విస్మయం చెందే అంశం. అందుకే ‘భరత్ అనే నేను’ సినిమా ఫలితం ప్రిన్స్ కెరీర్ కు ఓ అగ్ని పరీక్షలా మారింది.
అందరూ భావించినట్లు ‘భరత్ అనే నేను’కు పాజిటివ్ టాక్ వచ్చినా గానీ, ఫస్ట్ డే ఎంత కొల్లగొడుతుందన్నది కూడా కీలకం కాబోతోంది. డిజాస్టర్ టాక్ వచ్చినపుడు కలెక్షన్స్ లేకపోవడం సమంజసమే గానీ, హిట్ టాక్ వచ్చినపుడు రికార్డులు సాధించకపోవడం స్టార్ స్టేటస్ ను ప్రశ్నించేలా చేస్తుంది. దీంతో ఏ రకంగా చూసుకున్నా ‘భరత్ అనే నేను’కు రాబోతున్న ఫస్ట్ కలెక్షన్స్ ప్రిన్స్ స్టామినాకు నిదర్శనంగా ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
Most pregnancy updates focus on the growing baby bump and preparations for motherhood. Samantha Ruth…
Rishab Shetty's Shivaji Maharaj biopic is getting a new production partner. Bhushan Kumar has joined…