
రెండు సంవత్సరాలు మహేష్ డిప్రెషన్లోకి పోయి, తనకు శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన కొరటాలనే నమ్ముకున్నాడు. కొరటాల మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకుని, భరత్ అనే నేనుతో విజయాన్ని ఇచ్చాడు.
భరత్ అనే నేను విజయంతో మళ్ళి మహేష్ మొహం లో కళ, కళ్ళలో ఆనందం కనపడుతున్నాయి. మహేష్ నటన ని అందరు మెచ్చుకుంటున్నారు. సినిమా కలెక్షన్ల పరంగాకూడా రికార్డులు క్రియేట్ చేస్తుండటం, మహేష్ కి కొత్త బలాన్నిచ్చింది. ఈరోజు జరిగిన థాంక్స్ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్న మహేష్, సినిమా యూనిట్ ను మెచ్చుకున్నారు. కొసమెరుపు ఏంటంటే ఈ ఆనందం లో పడి , సినిమా నిర్మాతను గూర్చి చెప్పడం మర్చిపోయారు. తరువాత మళ్ళి నిర్మాతకు థాంక్స్ చెప్పారు.
విలేఖర్లు, ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు, చాలా ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చాడు మహేష్.హోలీ ఫైట్ ఎప్పుడు పెడతారు అని అడిగితే ..అసలు ఆ ఫైట్ ఉందని మీకెలా తెలుసండి బాబు అని నవ్వేసాడు సూపర్ స్టార్. తొలి షో చూసి, తన భార్య నమ్రత సినిమా సూపర్ హిట్ అని చెప్పిందన్నాడు, తొలిసారి ట్విట్టర్లో తన భార్యకు ముద్దిస్తున్న ఫోటో పోస్ట్ చేసాడు.
భరత్ అనే నేను తొలి మూడు రోజుల్లో,అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇక నుండి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో, మహేష్ స్థానాన్ని ఎక్కడ నిలబెడుతుందో .. వేచి చూడాలి!
Mumbai Indians are likely to bring back Rohit Sharma as captain for IPL 2027, replacing…
ల్యాండ్ లైన్ ఫోన్ల జమానాలో ఫోన్ కాల్ వస్తే ఇంట్లో అందరూ దాని చుట్టూ చేరేవారు. అవతలి వ్యక్తి కుటుంబ…