
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు బాబు పుట్టిన రోజు. కనుక ఎస్ఎస్ఎంబీ29 నుంచి రాజమౌళి తప్పకుండా ఏదో ఒక అప్‌డేట్ ఇస్తారని అభిమానులు ఆశించడం సహజం. ఒకవేళ మహేష్ బాబు వేరే దర్శక నిర్మాతలతో చేస్తున్నా తప్పకుండా అభిమానులకు కానుకగా ఏదో ఓ అప్‌డేట్ ఇచ్చేవారు.
కానీ రాజమౌళి మాత్రం అభిమానులను ఉసూరుమనిపించారు. ఇటీవలే మేము ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ మొదలుపెట్టాము. దీనికున్న విస్తృతస్థాయికి ఓ ఫొటో లేదా ప్రెస్‌మీట్ పెట్టి ఎదో చెప్పితే సరిపోదు. కనుక ఈ సినిమా గొప్పదనం తెలియజేసేవిదంగా, ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తున్నాము. అది నవంబర్‌లో విడుదల చేస్తాము. అది కనీవినీ ఎరుగని విధంగా ఉంటుంది. కనుక అంతవరకు కాస్త ఓపిక పట్టమని రాజమౌళి విజ్ఞప్తి చేశారు.
కానీ మహేష్ బాబు మొహం కనపడకుండా ఓ పోస్టర్ విడుదల చేశారు. దానిలో రక్తం అంటుకొని ఎర్రగా మారిన మహేష్ బాబు ఛాతిపై మెడలో ధరించిన ఓ గొలుసు… దానికింద వరుసగా శివుడి బొట్టు, త్రిశూలం, డమరుకం, నందీశ్వరుడు బొమ్మలున్నాయి.
రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 పూర్తి చేసేందుకు కనీసం రెండు మూడేళ్ళు లేదా మరికాస్త ఎక్కువే సమయం తీసుకుంటారు. కానీ అన్నేళ్ళపాటు మహేష్ బాబు వంటి అగ్రనటుడి సినిమా ఒక్కటీ రాదని తెలిసి అభిమానులు బాధపడకుండా ఉండరు.
కనుక ఎస్ఎస్ఎంబీ29 ఎంత పెద్ద, ఎంత గొప్ప సినిమా అయినా రాజమౌళి అప్పుడప్పుడు అప్‌డేట్స్ ఇస్తుండటం చాలా అవసరం. లేకుంటే మహేష్ బాబు స్థానంలో ‘వ్యాక్యూం’ ఏర్పడినట్లు ఉంటుంది కదా?
ప్రజలు సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా తప్పించుకోవడం అంటే మొసళ్ళ చెరువులో చేపలు జీవించడం వంటిదే అని చెప్పవచ్చు. ప్రతీ…
Nani has already established a strong presence among Tier-2 heroes when it comes to Day…