
అలాంటి మణిపూస లాంటి బాణీలలో ఒకటైన ‘ఆటపాటలాడు’ పాట మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫ్యామిలీ అంతా కలిసి పాడుకునే ఈ పాటను ఊటీ అందాల నడుమ అద్భుతంగా చిత్రీకరించారు. కుటుంబం మొత్తం ఊటీ టూర్ కు వెళ్ళిన నేపధ్యంలో వచ్చే ఈ పాటను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్వయంగా రచించడం విశేషం.
‘ఈ క్షణమన్నది నిజమే అయితే… చూడని రేపును ఇపుడే కనమా…‘ అంటూ మేకింగ్ వీడియోలో రావు రమేశ్ చెప్పినట్లు అద్భుతమైన సాహిత్యంతో, అందమైన లొకేషన్లలో ‘బ్రహ్మోత్సవం’ టీం ఆడిపాడిందని అర్ధమవుతోంది. విడుదల అవుతున్న ఒక్కో వీడియో ప్రిన్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీంతో మే 20వ తేదీన ‘బ్రహ్మోత్సవం’ జరుపుకోవడానికి ప్రిన్స్ అభిమానులు సర్వం సిద్ధమవుతున్నారు.
Following the commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is currently starring as…
Tollywood’s release calendar is getting a little messy. As per the buzz, around four films…