“బ్రహ్మోత్సవం” టీజర్ – ‘క్లారిటీ’ మిస్ కాలేదు!

mahesh babu brahmostavam trailer talkశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “బ్రహ్మోత్సవం” ఫస్ట్ టీజర్ వచ్చేసింది. కుటుంబ బాంధవ్యాలను ప్రతిబింబించే చిత్రంగా ప్రచారం కాబడుతున్న “బ్రహ్మోత్సవం” దానికి తగ్గట్లే ఉంది. మహేష్ తో పాటు హీరోయిన్ ప్రణతి మరియు సినిమాలోని ఇతర తారాగణం అంతా ఈ టీజర్ లో దర్శనమిచ్చారు. యథావిధిగా ప్రిన్స్ ఛార్మింగ్ లుక్ అభిమానులను ఆకట్టుకోగా, రత్నవేలు ఫోటోగ్రఫీ పాటను గ్రాండ్ లుక్ లో నిలబెట్టింది. ఈ సినిమా షూటింగ్ ఈ పాట చిత్రీకరణతోనే ప్రారంభమైంది.

“వచ్చింది కదా అవకాశం… ఓ మంచి మాట అనుకుందాం… ఎందుకు ఆలస్యం..? అందరినీ రమ్మందాం…” అంటూ వచ్చిన లిరిక్స్ బహుశా “హ్యాపీ న్యూ ఇయర్” అని చెప్పడానికే అన్నట్లుగా ఉన్నాయి. “కుటుంబంలోని నలుగురు కలిసి చేసుకుంటే అదే బ్రహ్మోత్సవం అని” దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పినట్లు… “బ్రహ్మోత్సవం”కు అసలు అర్ధం చెప్పేలా ఈ సినిమా కనపడుతోంది. కొత్త సంవత్సరంలో విడుదలైన తొలి టీజర్ ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT
Latest Stories