
‘కాటమరాయుడు’ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు ఓ అతిథి పాత్ర పోషించారన్న టాక్, ఈ సినిమా టీజర్ విడుదల కాక ముందునుండి వినపడుతోంది. కానీ, టీజర్ విడుదలైన తర్వాత ట్రైన్ షాట్ ను చూపెడుతూ… ఇందులో ఉన్నది మహేష్ బాబేనన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనని తేలిపోయింది. నిజానికి ఈ సినిమా తమిళ వర్షన్ “వీరమ్”లో ఎలాంటి అతిథి పాత్రలకు ఆస్కారం లేదు. కానీ, ‘కాటమరాయుడు’ టీజర్ లో చూపించిన విధంగా ఓ రైలు ఫైట్ సన్నివేశం అయితే ఉంది.
ఈ ఫైట్ సీన్లలో అజిత్ తప్ప మరో హీరో ఎవరూ లేరు. కానీ, తెలుగుకు వచ్చేపాటికి ఇక్కడ మహేష్ బాబును చూపించబోతున్నారని విస్తృతమైన ప్రచారం జరిగింది. కానీ, ‘కాటమరాయుడు’ టీజర్ ను ఒకటికి, రెండు సార్లు నిశితంగా పరిశీలిస్తే… ఇందులో ఎంత వాస్తవం ఉందో అందరికీ అవగతమైపోతుంది. ఈ టీజర్ లో రైలులో పవన్ ఫైటింగ్ చేస్తున్న రెండు, మూడు షాట్స్ ఉండడంతో, అక్కడ ఉన్నది మహేష్ కాదు, పవన్ అన్న విషయం ఇట్టే అర్ధమైపోతుంది.
టీజర్ లోని 23, 27 సెకన్లలో ఉన్న ట్రైన్ ఫైటింగ్ షాట్స్ చూస్తే… రౌడీలను దుమ్ము దులిపిన వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. పెద్ద సినిమాలకు ఇలాంటి పుకార్లు షికారు చేయడం సర్వ సాధారణమే. అయితే పవన్ సినిమాలో ఏకంగా మహేష్ ఉన్నాడని ప్రచారం జరగడంతో దీనికి మరింత ప్రాధాన్యత దక్కింది. అయితే ఇక్కడ ప్రిన్స్ పరంగా పరిశీలించాల్సిన మరొక విషయం ఏమిటంటే… రీమేక్ సినిమాలలో ప్రిన్స్ కనపడరన్న పాలసీ అభిమానులతో పాటు, యావత్తు ఇండస్ట్రీ వర్గాలకు కూడా తెలిసిందే. సో… ఇక క్లారిటీ వచ్చేసినట్లేగా..!
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…