
అదే పూరి మళ్ళి ప్లాపుల్లో ఉన్నపుడు బిజినెస్ మాన్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు,శ్రీనువైట్ల నమో వెంకటేశా ప్లాప్ తో బాధపడుతున్నప్పుడు దూకుడు సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేసాడు,యావరేజ్ సినిమాలు తీస్తున్న సుకుమార్ కు వన్ నేనొక్కడ్నే సినిమా ద్వారా ఛాన్స్ ఇవ్వగా అది రివర్స్ అయ్యింది.ముకుంద ప్లాప్ తో ఉన్న శ్రీకాంత్ అడ్డాల కు మరో ఛాన్స్ ఇచ్చి బ్రహ్మోత్సవంతో దెబ్బతిన్నాడు.
అప్పటినుండి మహేష్ లో కొంత మార్పు వచ్చింది,హిట్ లిస్ట్ లో ఉన్న కొరటాల,మురుగదాస్ లను ఎంచుకున్నాడు.ఇప్పుడు భరత్ అనే నేను కమర్షియల్ విజయం సాధించడం తో మహేష్ ద్రుష్టి ,రంగస్థలం సక్సెస్ తో ఉన్న సుకుమార్ వైపు తిరిగింది.మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ సినిమా తన 26 వ సినిమా అని ప్రకటన వచ్చేసింది.
అసలు మహేష్ తన 26వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తానని ట్విట్టర్లో ప్రకటించేశాడు ,కానీ ఆజ్ఞత వాసి ప్లాప్ అవ్వడం చూసి భయపడ్డాడో ఏమో ,సినిమా ఊసే ఎత్తలేదు ,ఓ పక్క త్రివిక్రమ్ ఎన్ టి ఆర్ తో సినిమా స్టార్ట్ చేసాడు,అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ కి కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చిన మహేష్ సుకుమార్ సినిమా తరవాత చేస్తాడా?సుకుమార్ సినిమా 2018 చివర లో స్టార్ట్ అవుతుంది,ఈ మధ్యలో రాజమౌళి సినిమా దుర్గ ఆర్ట్స్ కి చెయ్యాల్సి ఉంది.మహేష్ కేరీర్లో సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ల వెంట పరుగెత్తడం స్టార్ట్ చేసేసాడు.ఎన్ని విజయాలు అందుకుంటాడో వేచి చూడాలి.
ఒకప్పుడు పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం కూడా. ఆర్థిక ఇబ్బందులు,…
సీఎం గా చంద్రబాబు నాయుడు ఫెయిల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు సాగు నీటి నుంచి ప్రజలకు…