
పవర్ ఫుల్ మాస్ అప్పీల్ గా “అభిమన్యు” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని, అలాగే క్లాస్ వర్గాలను మెప్పించేలా “మర్మం” అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రెండింటిలో ఏదొక టైటిల్ ఖరారు అవుతుందో లేక వీటన్నింటిని పక్కనపెట్టి మరో కొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారో గానీ, మొత్తానికి మరో రెండు రోజుల్లో ఈ సినిమా టైటిల్ పై ఓ స్పష్టత రానుందని సమాచారం.
అంటే ఇన్నాళ్ళ పాటు ప్రిన్స్ అభిమానులను ఊరించిన మురుగదాస్ సినిమా నామకరణం చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. టైటిల్ సంగతి ఇలా ఉంటే, ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ ను తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ పర్వదినం కానుకగా మార్చి 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 23వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మురుగదాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…