Telugu

అనిల్ రావిపూడికి మహేష్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తారట

Mahesh Babu fans to build temple for anil ravipudi
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. గత సంక్రాంతికి ఎఫ్2 వంటి భారీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు డీసెంట్ టాక్ అండ్ రివ్యూస్ వస్తున్నాయి.. ఓపెనింగ్స్ కూడా బలంగా ఉన్నాయి. మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

ఈ మధ్య కాలంలో మహేష్ బాబు కామ్ అండ్ సాఫ్ట్ రోల్స్ చేస్తున్నాడు. మహేష్ లోని ఎనర్జీని, మాస్ యాంగిల్ ని వారు చాలా కాలంగా మిస్ అవుతున్నారు. ఆ లోటును అనిల్ పూర్తిగా పూడ్చేశాడు. మరీ ముఖ్యంగా మహేష్ తో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సినిమాలో స్టెప్స్ కూడా వేయించాడు అనిల్.

ADVERTISEMENT

మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ చేసిన డాన్స్ ఆయన కెరీర్ లోని ది బెస్టు అంటున్నారు అభిమానులు. దానితో వారి వరకు సినిమా మీద ఫుల్ హ్యాపీ. కొందరైతే ఏకంగా అనిల్ రావిపూడి గుడి కట్టేయాలి అంటున్నారు. కొన్ని కొన్ని హీరోయిక్ యాంగిల్స్ అయితే అదిరిపోయాయి.

ఈ మధ్య కాలంలో మహేష్ కు అంతటి ఎలేవేషన్స్ పడలేదు. అయితే మాములు ఆడియన్స్ మాత్రం హీరో ఎలేవేషన్స్ తో పాటు కథ మీద మరింత వర్క్ చేసి ఉండాల్సింది అంటున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 103 కోట్ల విలువ చేశాయి. సినిమా థియేటర్స్ లో ఆమేరకు షేర్ రాబట్టాల్సి ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Ramayana Buzz: Where Is Kajal Aggarwal?

Kajal Aggarwal had earlier said that she was playing a small role in Ramayana, but…

28 minutes ago

Jogi Ramesh Daughter-in-Law’s Accident Sparks Suspicion

A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…

57 minutes ago