
ఈ సినిమాలో ‘మధురం మధురం’ అనే పాటలో మహేష్ ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన అవంతిక నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వెబ్ మీడియాలో దర్శనమిస్తోంది. ప్రిన్స్ అభిమానిగా అవంతిక చేసిన ఇంటర్వ్యూ క్యూట్ క్యూట్ గా సందడి చేస్తోంది. ఇందులో భాగంగా ‘బ్రహ్మోత్సవం’ విశేషాల గురించి క్లుప్తంగా ప్రిన్స్ చెప్పిన విశేషాలు…
ఫస్ట్ టైం ‘బ్రహ్మోత్సవం’ సెట్ కొచ్చినపుడు చాలా మంది నటులను చూసి భయమేసిందని, ఒక రెండు రోజుల తర్వాత అలవాటైందని చెప్పిన ప్రిన్స్, తను ‘సూపర్ హీరో’ పాత్రలను చేయాలనుకోవడం లేదని అన్నారు. సెట్స్ లో ఉన్న సమయంలో ఓ ‘స్ప్రింగ్’ బాటిల్ తాగుతుంటారు… దానికి ఏమైనా ప్రత్యేకదా ఉందా అన్న ప్రశ్నకు… అలాంటిదేమీ లేదు… ప్లాస్టిక్ వాడకూడదు గనుక, గ్లాస్ బాటిల్ లో మంచి నీళ్ళు తాగుతుంటానని, అంతకు మించి ఏమీ లేదని చెప్పుకొచ్చారు.
తనకు రోడ్ సైడ్ పానీ పూరీ వంటివి ఇష్టం ఉండవని, అందుకని అలాంటి వాటికి జోలికెళ్ళనని చెప్పిన మహేష్, చిన్నతనంలో సరదాగా తన తండ్రి ఏం చెప్తే అది చేసానని, అయితే అంత అవగాహన కూడా లేదని, నటుడిగా కాకుండా మరొకటి అన్న ఆలోచనే భయకరంగా ఉంటుందని, తన చిన్నతనంలోనే నటుడు కావాలన్న నిర్ణయం జరిగిపోయిందని… చిన్నారి అడిగిన ముద్దుముద్దు ప్రశ్నలకు చక్కని జవాబులు అందించారు ప్రిన్స్.
The gap between film reviewers and audiences is nothing new in Telugu cinema. Nani's The…
Virat Kohli and Shubman Gill smashed centuries as India defeated West Indies by eight wickets…