
[m9ad]
మహేష్ కు జతగా ఓ పేద స్నేహితుడి పాత్రలో నటిస్తోన్న మాట వాస్తవమేనని, ఒక రకంగా ‘గమ్యం’ సినిమాలో గాలి శీను రోల్ తరహాలో ఉంటుందని, ఆ పాత్ర ఎలా అయితే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో ఇది కూడా అలాగే అవుతుందని, ఇంతకుమించి ఏమీ చెప్పొద్దంటూ మహేష్ బాబు నుండి ‘స్వీట్’ వార్నింగ్ వచ్చిందంటూ ఛలోక్తులు విసిరారు.
ఇప్పటివరకు 45 రోజులు మహేష్ తో కలిసి పనిచేసానని, అలాగే మరో 100 రోజులు లాంగ్ షెడ్యూల్ కు వెళ్తున్నామని అన్నారు. 145 రోజులు ‘మహర్షి’లో భాగస్వామ్యం అవుతున్నాడంటే, ఇది గెస్ట్ రోల్ కాదు, సినిమా మొత్తం అల్లరి నరేష్ ఉంటాడని చెప్పకనే చెప్పాడు. ఇక తాజా చిత్రం ‘సిల్లీ ఫెలోస్’ అందరినీ నవ్వించే చిత్రంగా నిలుస్తుందన్న భావనను వ్యక్తపరిచారు అల్లరోడు.
Abhishek Sharma is back at the top of the ICC T20I batting rankings, but there…
Trivikram Srinivas had special praise for Venkatesh at the pre-release event of Aadarsha Kutumbam: House…