Telugu

మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇక లేరు!

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకొంటున్నారు. ఈరోజు ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.

మహేష్ బాబుకి ఆమెతో చాలా బలమైన అనుబందం ఉంది. ఆయనకు మనసు ఎప్పుడు బాగోకపోయిన తల్లి వద్దకు వెళ్ళి ఆమె పక్కన కూర్చొని కాసేపు కబుర్లు చెప్పి ఆమె చేతి కాఫీ తాగితే మనసులో ఆందోళనలన్నీ తొలగిపోయి మళ్ళీ హుషారుగా షూటింగులలో పాల్గొంటారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. మహేష్ బాబు తల్లిని దేవతలా చూసుకొంటారని చెప్పారు. అంత బలమైన అనుబందం కలిగిన తల్లి హాస్పిటల్‌లో మంచం మీద ఉండటంతో గత కొన్నిరోజులుగా మహేష్ బాబు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన తోడబుట్టిన సోదరుడు రమేష్ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తల్లి ఇందిరాదేవి కూడా కన్నుమూయడంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ADVERTISEMENT

కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ కాకుండా మరో ముగ్గురుకుమారులు, పద్మావతి, మంజుళ, ప్రియదర్శిని అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగు సినిమాలలో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందిరాదేవి మృతి గురించి తెలియగానే తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు కృష్ణ, మహేష్ బాబులకు సంతాపం తెలియజేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

KWK9: Rashmika Proposed 100 Times? Vijay Drops a Bomb!

Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…

12 minutes ago

BB Telugu: Why So Much Favouritism On Thrigun?

In the Bigg Boss TV reality show, every season, someone gets a lot of push.…

42 minutes ago