
తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్‌లో కూడా ఈయన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబోలో తెరకెక్కే సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ఇంకా పట్టాలెక్కలేదు, అప్పుడే రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను 150 కోట్లకు కొనేందుకు ముందుకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్ని భాషల థియేట్రికల్ రైట్స్‌కు 150 కోట్లు పెట్టేందుకు రిలయన్స్ సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మహేష్‌బాబు సినిమాకు ఈ స్థాయి బిజినెస్ అవ్వడం టాలీవుడ్ వర్గాల వారు సైతం ఆశ్చర్యంను కలిగిస్తోంది. మహేష్‌బాబుపై నమ్మకమా లేక మురుగదాస్‌పై నమ్మకమో కాని రిలయన్స్ వారు ఇంత మొత్తం ఈ సినిమాపై పెట్టేందుకు సిద్దం అయ్యారు. త్వరలోనే ఢీల్ కుదిరే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే నిర్మాతలకు లాభాల పంట పడటం ఖాయం అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…