
మరి ఈ టైటిల్ పై ప్రిన్స్ అభిమానుల మరియు నెటిజన్ల రియాక్షన్స్ ను పరిశీలిస్తే నిరుత్సాహపడక తప్పదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో “స్పైడర్” టైటిల్ కు పాజిటివ్ రియాక్షన్స్ రాకపోవడం గమనించదగ్గ విషయం. ఈ టైటిల్ సౌండింగ్ ఫన్నీగా ఉండడం ఒక కారణమైతే, హాలీవుడ్ పాపులర్ మూవీ ‘స్పైడర్ మ్యాన్’ సినిమా వలన, ఈ ‘స్పైడర్’ను వాడుకుంటూ ‘స్పైడర్ రెడ్డి’ వంటి విచిత్రమైన టైటిల్స్ తో యూ ట్యూబ్ లో హల్చల్ చేసే స్పూఫ్స్ కు కొదవలేదు. దీంతో ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో ‘స్పైడర్’పై నెగటివ్ స్పందనలు వస్తున్నాయి.
అయితే మహేష్ బాబు లాంటి హీరోను పెట్టుకుని మురుగదాస్ వంటి దర్శకుడు, కాన్సెప్ట్ ను పక్కనపెట్టి గుడ్డిగా ఓ టైటిల్ ను పెట్టేస్తారనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. దీంతో ‘స్పైడర్’ టైటిల్ తో వెలువడబోయే ఫస్ట్ లుక్ సినిమాకు చాలా కీలకం కాబోతోంది. ఫన్నీ సౌండింగ్ కూడుకున్న ఈ టైటిల్ ఆవిష్కరణలోనే, సినిమా కాన్సెప్ట్ ను బిల్డప్ చేయగలిగితే, ప్రస్తుతం ఉన్న నెగటివ్ రియాక్షన్స్ కూడా ఒక్కసారిగా పాజిటివ్ గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో వేచిచూడాలి. మొత్తానికి ‘స్పైడర్’ టైటిల్ ను ఖరారు చేసారన్న టాక్ బయటకు వచ్చిన తర్వాత “ఫస్ట్ లుక్” అంశం మరింత ఆసక్తికరంగా మారింది.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…