
అయితే ఇటీవల పాల్గొన్న బుల్లితెర కార్యక్రమంలో యాంకర్ మహేష్ ను పౌరాణిక పాత్రల్లో నటించేందుకు సిద్ధమేనా? ఓ ప్రశ్న వేసారు. దీనికి సమాధానంగా ‘నో’ చెప్పిన మహేష్, మళ్ళీ ఒకవేళ రాజమౌళి దర్శకత్వం వహిస్తానంటే చేస్తాను… అతను తప్ప మరొకరు హ్యాండిల్ చేస్తారని భావించడం లేదు అంటూ సమాధానమిచ్చారు. దీంతో మహేష్ – రాజమౌళి కాంబో పౌరాణిక మూవీతో రాబోతుందన్న సిగ్నల్ ప్రిన్స్ ఇచ్చారా అంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.
‘బాహుబలి 2’ పూర్తయిన తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని స్వయంగా రాజమౌళి గతంలోనే వ్యాఖ్యానించగా, దీనిని ప్రిన్స్ కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ జోనర్ లో ఈ సినిమా ఉంటుందని అడిగిన ప్రశ్నకు మాత్రం ‘ఇప్పటికే మహేష్ కు ఓ లైన్ చెప్పాను’ అంటూ రాజమౌళి దాటవేయగా, స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు గనుక ఇప్పుడే చెప్పడం ముందస్తు చర్య అవుతుందని మహేష్ తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని ఎదురు చూస్తున్న అశేష అభిమానులకు… బహుశా ‘పౌరాణికం’ అంటూ మహేష్ పరోక్ష సంకేతాలు ఇచ్చారా..? కాలమే సమాధానం చెప్పాలి..!
Ram Charan had been very unconventional with his choice of directors, and this was already…
ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు సైతం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని అందరికీ తెలుసు. కనుక ఎన్నికల బరిలో దిగిన అభ్యర్ధులు…