పిక్ టాక్ : “బ్రహ్మోత్సవం”లో ప్రిన్స్ లుక్!

mahesh babu new look in brahmotsavam movieప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న “బ్రహ్మోత్సవం” షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలియగా, ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఊటీ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబుతో ఉన్న ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ అయిన రత్నవేలు. స్టైలిష్ గాగుల్స్, బ్లూ షర్టుతో ప్రిన్స్ యధావిధిగా అదిరిపోయే లుక్ లో కనపడుతున్నాడు. కుటుంబ విలువల నేపధ్యంలో “బ్రహ్మోత్సవం” సాగుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఇప్పటికే స్పష్టం చేయగా, అలాంటి ఫ్యామిలీ లుక్ లోనే ప్రిన్స్ దర్శనమిస్తున్నాడు. అలాగే ఊటీ షెడ్యూల్ కు సంబంధించి అభిమానులతో దిగిన మరికొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ప్రిన్స్ అభిమానులను అలరిస్తున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories