
ఊటీ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబుతో ఉన్న ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ అయిన రత్నవేలు. స్టైలిష్ గాగుల్స్, బ్లూ షర్టుతో ప్రిన్స్ యధావిధిగా అదిరిపోయే లుక్ లో కనపడుతున్నాడు. కుటుంబ విలువల నేపధ్యంలో “బ్రహ్మోత్సవం” సాగుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఇప్పటికే స్పష్టం చేయగా, అలాంటి ఫ్యామిలీ లుక్ లోనే ప్రిన్స్ దర్శనమిస్తున్నాడు. అలాగే ఊటీ షెడ్యూల్ కు సంబంధించి అభిమానులతో దిగిన మరికొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ప్రిన్స్ అభిమానులను అలరిస్తున్నాయి.
కొన్ని రాజకీయ బంధాలకు వివరణలు, నిర్వచనాలు అవసరం ఉండదు. ఒక్క ఫోటోతో మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. అటువంటిదే సోషల్ మీడియాలో…
ఈ నెల 1న (ఆదివారం) జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 60.96 శాతం పోలింగ్ నమోదైంది. నగర, పట్టణ ఓటర్లు కొంతమేర…