
సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో, నీరసంగా మొబైల్ లోని ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ ను ఓ సగటు మహేష్ అభిమాని ఎలా చూసుకుంటున్నారో, ప్రస్తుతం మహేష్ ఇచ్చిన స్టిల్ కూడా అలాగే కనపడుతోంది. ఇక షూటింగ్ విషయానికి వస్తే… నిమ్స్ లో ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ నిరసన కార్యక్రమాలతో అర్ధాంతరంగా వాయిదా పడడం, ప్రిన్స్ ఫ్యాన్స్ ను మరింత నిరుత్సాహానికి గురిచేసే అంశం.
శనివారం నుండి భువనగిరి నిమ్స్ భవన సముదాయంలో జరగాల్సిన ఈ చిత్రం షూటింగ్ స్థానిక ప్రజల నిరసన కారణంగా ఆగిపోయింది. ఈ భవనంలో వైద్య సేవలు ప్రారంభించడంలో తెలంగాణా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వైద్య సేవల కోసం ఎంతోకాలంగా తాము ఎదురు చూస్తుంటే, అది కార్యరూపం దాల్చకుండా భవనాన్ని ఓ సినిమా షూటింగ్ కు అద్దెకివ్వడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.
యువ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో పలువురు నిమ్స్ భవనానికి వచ్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ జరపడానికి వీల్లేదని హెచ్చరించారు. దీంతో నిమ్స్ డైరెక్టర్ మనోహర్ స్పందించి, షూటింగ్ అనుమతులను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇక చేసేదేమీ లేక తాము తెచ్చుకున్న షూటింగ్ సామాగ్రిని తీసుకుని చిత్ర యూనిట్ వెనక్కెళ్లిపోయింది. ఇలా అన్ని రకాలుగా సంతోష్ శివన్ పోస్ట్ చేసిన డల్ ఫోటో సూట్ అవుతోంది.
Following the failure of Kara, Dhanush is currently starring as the lead in Om directed…
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…