
‘మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి’ అంటూ http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్‌ను మహేశ్ బాబు టీం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీన్ని మహేష్ బాబు తిరిగి షేర్ చేశారు. ఇందులో మూడు రోజులు కౌంట్‌డౌన్ ఉంచారు. ఈ పేజ్‌లోని టాబ్స్ లో దుస్తుల రకాలు, బ్రాండ్లు ఉంచారు. దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఈ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ హప్పెనింగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే ‘రౌడీ’ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్‌ను నడుపుతున్నారు. బాలీవుడ్లో హృతిక్ రోషన్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, దీపికా పదుకొణె, సన్నీ లియోని తదితరులు సొంతంగా దుస్తులు, యాక్సెసెరీస్ బ్రాండ్లను నడుపుతున్నారు. మరి మహేష్ బాబు ఈ కొత్త బిజినెస్ లో సక్సెస్ అవుతారో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుంది.
Director Karthik Subbaraj's indie film Dorothy starring Sananth and Rishikanth in the lead roles was…
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…