
తనకు నచ్చిన సినిమాల గురించి నిర్మొహమాటంగా ప్రశంసించడం ప్రిన్స్ ఎప్పుడూ చేసే విషయమే అయినా, ‘అర్జున్ రెడ్డి’ విషయంలో మాత్రం ఇంకాస్త ఉత్సాహం చూపించారనే చెప్పాలి. అయితే మహేష్ బాబు నుండి ఊహించని ఈ ట్వీట్ల సందేశంలో చిత్ర హీరో మరియు యూనిట్ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. ముఖ్యంగా తన అభిమాన హీరో నుండి ఈ రకమైన ప్రశంసలతో లభించడం విజయ్ ఊహించని విషయమేమో!
గతంలో పలు ఇంటర్వ్యూలలో తన అభిమాన హీరో మహేష్ బాబు అని, కాలేజీ రోజుల నుండి ఫాలో అవుతున్నానని విజయ్ దేవరకొండ చెప్పిన సంగతి సినీ విజ్ఞులకు విదితమే. ఇప్పుడు అదే మహేష్ నుండి ప్రశంసలు లభించడం అనేది ఎవరికైనా చెప్పుకోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అందుకే “ఇప్పటివరకు దిమ్మతిరిగిన బాక్సాఫీస్, ఇక బద్దలైపోవాలి” అంటూ ప్రిన్స్ కు రిప్లై ఇచ్చాడు విజయ్.
Pawan Kalyan’s birthday has turned into a celebration on the big screen as Panjaa returns…
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…