
ఇదే క్రమంలో కొరటాల శివ వంతు వచ్చిందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ‘శ్రీమంతుడు’ సినిమా ద్వారా తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ రుణం తీర్చుకోలేనిది అంటూ ఇటీవల ‘సాక్షి’ అవార్డ్స్ లో కూడా మహేష్ బాబు ఉపన్యసించారు. తాజాగా ఆ రుణం తీర్చుకునేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ప్రస్తుతం తానూ దర్శకత్వం వహిస్తున్న ‘జనతా గ్యారేజ్’ కోసం కొరటాల శివ ప్రిన్స్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది.
‘బాద్ షా’ మాదిరే ‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం మహేష్ బాబును వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా కొరటాల శివ అడగడం, వెంటనే ప్రిన్స్ మహేష్ బాబు అంగీకరించడం జరిగిపోయిందని సినీ వర్గాల భోగట్టా. ఎటువంటి అధికారిక సమాచారం లేని ఈ వార్త కార్యరూపం దాలిస్తే… ‘జనతా గ్యారేజ్’పై అంచనాలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…