
అయితే ఇటీవలే ముగిసిన అహ్మదాబాద్ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. హాస్పిటల్ లో స్టేచ్చర్ పట్టుకుని నడుస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు స్టిల్ వైరల్ గా మారింది. గుజరాత్ డిప్యూటీ సిఎం మహేష్ ను కలిసిన సమయంలో హాస్పిటల్ లోనే ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఈ షెడ్యూల్ చివరి రోజుల్లో చిత్రీకరించిన షాట్స్ గా కనపడుతున్నాయి.
ఇలా లీక్ అయిన ఫోటోలతో ప్రిన్స్ అభిమానులు సందడి చేస్తూ జనవరి 1వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజునే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా “ఫస్ట్ లుక్”తో పాటు ప్రకటించనున్నారు. మొత్తం నాలుగు టైటిల్స్ ను పరిశీలిస్తున్నామని, అందులో ఒకటి ‘సంభవామి’ అని, అంతేకాని ఇంతవరకు ఏ టైటిల్ ఖరారు చేయలేదని నిర్మాత ఠాగూర్ మధు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…
Ram Charan and Sukumar’s new film #RC17 was officially launched with a pooja ceremony attended…