Telugu

సంక్రాంతి రిలీజ్ డేట్ల వివాదం ఉత్తుత్తిదేనా?

సంక్రాంతి విడుదల తేదీలపై మళ్ళీ చర్చ మొదలయ్యింది. అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తేదీ మారుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే సినిమా రఫ్ కాపీ చూసిన బన్నీ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అయితే 12న విడుదల అంటే అప్పటికే సరిలేరు నీకెవ్వరూ చాలా థియేటర్స్ లో ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ సరిపోదని, దానితో తన సినిమాను 10నే విడుదల చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారని వార్తలు వచ్చాయి.

ముందు అనుకున్నట్టు 12న వస్తే పర్లేదు… ముందుకు జరిగితే మాత్రమే అదే రోజున మేము కూడా వస్తాం అంటున్నారట. దీనితో న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన రెండు సినిమాల కొత్త పోస్టర్ల మీద విడుదల తేదీలు వెయ్యలేదు. దీనితో ఏం జరుగుతుందా అని అందరిలో ఆసక్తి ఉంది. అయితే రిలీజ్ డేట్లు మారే అవకాశం లేదని కొందరు అంటున్నారు.

ADVERTISEMENT

“ఈరోజుకు సరిలేరు నీకెవ్వరూ రెండో రోజు థియేటర్స్ అల వైకుంఠపురంలో మొదటి రోజు థియేటర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. దీనితో ఎక్సట్రాగా కొన్ని థియేటర్స్ కోసం అల వైకుంఠపురంలో టీం ఈ బ్లాక్ మెయిల్ కు తెరలేపింది. ఇప్పుడు మాకు 12న కొన్ని థియేటర్స్ ఇవ్వండి వాటిని 13న మళ్ళీ ఇచ్చేస్తాం అని బేరానికి దిగవచ్చు,” అని ఈ విషయం గురించి తెలిసిన ఒకరు అంటున్నారు.

మొత్తానికి అదే వైపుగా రాజీ కుదిరి ముందు అనుకున్నట్టుగా అవే తేదీలలో విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈరోజు లేదా రేపు దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా ఈ రెండు సినిమాలపై దాదాపుగా 200 కోట్ల బిజినెస్ ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Tragic Hyd ORR Accident Kills Young Telugu Actor

The Telugu film industry was left shocked after a tragic road accident in Hyderabad claimed…

21 minutes ago

Koratala Siva Launches Nara Rohith’s RN23

Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…

29 minutes ago