
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ వీకెండ్ కాశ్మీర్ లో మొదలు అవుతుంది. ఇప్పటికే మహేష్ బాబు కాశ్మీర్ చేరుకున్నాడు. ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నంలో ఉంది చిత్ర బృందం. దీనితో ఈ చిత్రం కోసం ఎడతెరపి లేకుండా షూట్ చెయ్యబోతున్నారు. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా సినిమాలలోకి విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.
13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమాకు చెందిన సెట్ లైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోవడం విశేషం. మరి వచ్చే సంక్రాంతికి కూడా అనిల్ ఇంకో బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి.
Namit Malhotra’s Ramayana has crossed $517K in US premiere advance sales, but the numbers reveal…
భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…